—– రెవెన్యూ అధికారులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
—– ప్రభుత్వం దృష్టికి భూ సమస్యను తీసుకెళ్తా: కేఎల్ఆర్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం తుక్కుగూడ కార్యాలయంలో..కొంగరకుర్థు దళిత రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
తుక్కుగూడ కార్యాలయంలో కలిసి తమ గోడును కిచ్చెన్నకు వివరించారు.సర్వేనంబర్ 73లో 43ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు 7దశాబ్ధాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే 2009లో హౌసింగ్ బోర్డుకు ఈ భూమిని కేటాయించారని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రావటంతో రైతులు అవాక్కైయ్యారు.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. తమకు ఇచ్చే పరిహారం చెప్పకుండా భూమిని తీసుకోవద్దంటూ కేఎల్ఆర్ కు రైతులు, మహిళలు విజ్ఞప్తి చేశారు.కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తప్పుడు సర్వేనంబర్ తో అగ్రిమెంట్లు చేసుకోవటం జరిగిందని తమకు సంబంధం లేదని లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమస్యపై వెంటనే ఆర్డీవోతో మాట్లాడి… అన్ని వివరాలు తెలుసుకున్నారు కిచ్చెన్న.
కొంగరకుర్థు రైతుల సమస్యను ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రావిర్యాల కాంగ్రెస్ నాయకులు సహా రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

