Saturday, February 21, 2026

*దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిన చారిత్రాత్మక రోజు*బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న *

నేటిసాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 20 (మెట్టు రుద్రరాజు).దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిన చారిత్రాత్మక రోజు. కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష, ఆయన రాజకీయ చాణక్యం, విద్యార్థుల బలిదానాలు, సకలజనుల సమ్మె వంటి ఉద్యమాల ఫలితంగారాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు ఈ రోజు.తిరుమలాయపాలెం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న మాట్లాడుతూ:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించి నేటికి 12 యేండ్లు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అభివృద్ధికి దూరంగా అన్ని విధాలుగా వంచించబడి, అవమానింపబడిన తెలంగాణ ప్రజలుస్వతంత్ర పాలనతో విముక్తి పొందిన రోజు ఇది.స్వరాష్ట్ర సాధన తర్వాత సొంత పరిపాలనలో 10 సంవత్సరాలలో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ ది. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని కుంటుపడేలా చేస్తోంది.కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిజాయితీగా పని చేయాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారుఊరు ఊరు, వాడ వాడ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే కావాలని ప్రజల మనసులో ఉంది అని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News