Tuesday, March 17, 2026

దహేగం మండలంలో హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్, ఎస్పీమృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం .కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్

నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 13కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి D/o చిన్నయ్య ఇటీవల హత్యకు గురైన ఘటనపై జిల్లా పరిపాలన స్పందించింది.ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేష్ దోత్రే మరియు జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ .బాధిత కుటుంబ సభ్యులకు రూ. 4,12,500/- ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. అదేవిధంగా, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద రూ. 5 లక్షల విలువైన ఇల్లు నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందించారు.అదనంగా, పొదుపు మహిళా సంఘం ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1,00,000/- ఆర్థిక సాయం చెక్కు రూపం లో అందజేశారు. మృతురాలి చిన్న తమ్ముడు తలండి ప్రసిక్ ను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో (నాల్గవ తరగతి) చేర్పించినట్లు అధికారులు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 100 ద్వారా లేదా నేరుగా పోలీసులను వెంటనే సంప్రదించాలని ఎస్పీ .ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలతో పాటు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, లోకేశ్వరరావు డిఆర్ఓ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, దహెగాం ఎస్.ఐ విక్రమ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News