Monday, December 23, 2024

దానిపైనే మోదీ తొలి సంతకం

  • – ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ
  • – కిసాన్ నిధి ఫైల్​పై తొలి సంతకం.. నిధుల విడుదల..
  • – రైతు సంక్షేమానికి పెద్దపీట : ప్రధాని మోదీ

నేటి సాక్షి, హైదరాబాద్​: ప్రధానమంత్రి గా సోమవారం నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్​లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్​లోని పీఎంవో ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. పీఎం కిసాన్ నిధి 17 విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్​పై ప్రధాని తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. రైతులకు దాదాపు 20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనున్నది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అందుకోసమే బాధ్యతలు స్వీకరించడం వెంటనే పీఎం కిసాన్ నిధి ఫైల్​పై సంతకం చేశానని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుందనీ పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News