నేటి సాక్షి, ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం నుండి జగిత్యాల వైపు వెళ్లే రహదారిపై చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి ఇలా దారికి అడ్డంగా ప్రమాదకంగా మారాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ దారి గుండా ప్రయాణం చేసేటప్పుడు మూలమలుపు ఉండి చెట్లు, చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే దారిపైన గతంలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలూ ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు దారికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని ప్రమాదాలను నియంత్రించే చర్యలు తీసుకోవాలి అని వాహనదారులు కోరుతున్నారు.





