నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబరు 1తమ ఇండ్లకు దారి సమస్యలు తీర్చి ఆదుకోవాలని అధికారులను కోరారు బాధితుల కథనం మేరకు మండలంలోని ఏ కోతకోట పంచాయతీ మంచినీళ్లపల్లికి చెందిన సుధాకర్ కాంతమ్మలకు ప్రభుత్వం 68/2 సర్వేనెంబర్ నందు ఇంటి స్థలాలు ఇచ్చారు వారు 25 ఏళ్లుగా ఇళ్లను నిర్మించుకొని కాపురం ఉంటున్నారు అయితే తమ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ముందున్న దారిని మూసేశారని వారి ఇరువురు వాపోయారు రాజకీయ కక్షాలను మనసులో పెట్టుకొని ప్రభుత్వం కల్పించిన రోడ్డును మూసేశారని ఈ విషయమై చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినామన్నారు దారి లేకపోవడంతో వరి పంటను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తుందన్నారు మండల అధికారులు స్పందించి తమ ఇళ్లకు దారిని చూపాలని వారు కోరుతున్నారు ఈ మేరకు అధికారులకు మొరపెట్టుకున్నారు

