, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణమైన హత్య జరిగింది.భార్య ఫై అనుమానంతో కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మల్లయ్య కిరాతకుడిగా మారాడు.అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి, గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల స్థానికుల కథనం మేరకు..లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధార వేణి మల్లయ్య- సత్తవ్వ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.కొడుకు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు.కూతురు ఇంటి వద్దె ఉంటుంది.మరోసారి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదును చూసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, శనివారం తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు.కోపంతో ఊగిపోతూ గొడ్డలితో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.నిందితుడిని లక్ష్మీపూర్ గ్రామ శివారులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సి ఐ సుధాకర్ వెల్లడించారు.





