నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 24కాగజ్ నగర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో బుధవారం దారుల్ అన్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, బ్లాంకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ మాతున్, జామియా మసీదు ఇమామ్ మౌలానా ఇంటిఖాబ్ ఆలం, ఆలయ పూజారి సంజయ్, గురుద్వారా గురు అమర్ సింగ్ పాల్గొన్నారు. అదేవిధంగా న్యాయవాద వృత్తిలో విజయవంతంగా అడుగుపెట్టిన ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు ముస్లిం మైనారిటీ యువకులకు ఘనంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఎల్ఎల్బి (లా)లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన యువకులను ట్రస్ట్ ప్రతినిధులు సత్కరించారు.సిర్పూర్ టౌన్‌కు చెందిన అబ్దుల్ షకీల్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి, కుమారుడు యువ న్యాయవాది ముహమ్మద్ అబ్దుల్ ముఫాసిల్ ఎల్ఎల్బి లాలో ఉత్తమ ఫలితాలు సాధించి ఇటీవలే హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విజయవంతమైన ఇతర యువ న్యాయవాదులు మహమ్మద్ సోహెల్ పాషా, సయ్యద్ లుక్మాన్ అహ్మద్, లను దారుల్ అన్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో దారుల్ అన్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ముహమ్మద్ ముఫాఖం అహ్మద్, రాష్ట్ర చైర్మన్ డాక్టర్ అబ్దుల్ ఖుద్స్, రాష్ట్ర వైస్ చైర్మన్ హఫీజ్ సయ్యద్ రిజ్వాన్, వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ ఎం.ఏ. రియాజ్, మాజీ కౌన్సిలర్ శరత్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు జాకీర్ షరీఫ్, ఇమామ్ ముహమ్మద్ సద్దాం, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ రావు, తదితరులు పాల్గొన్నారు.విజయవంతమైన యువ న్యాయవాదులకు పూలమాలలు,శాలువాలు అందజేసి ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు, మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.





