Wednesday, March 11, 2026

దాస్యం ప్రణయ్ భాస్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలి

60 డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి గత నేటి ముఖ్య మంత్రుల మాటలను గుర్తు చేస్తూ విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన ఆయన తనయుడు. జిడబ్ల్యూఎంసి 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ మాజీ మంత్రి, ఓరుగల్లు ప్రజలకు అత్యంత సన్నిహితుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి వేడుకలను దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ తన తల్లి దాస్యం సబితా భాస్కర్, సోదరి బావ అపూర్వ రంజిత్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. తొలుత వడ్డేపల్లి లోని వారి స్వగృహంలో పూజా కార్యక్రమాల అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత వడ్డేపల్లి గ్రామ ప్రణయన్న ఆప్తులు, అభిమానులతో కలిసి సుబేదారి లోని ప్రణయ్ మార్గ్ వద్ద ప్రణయ్ భాస్కర్ పటానికి పుష్పాంజలి ఘటించి నినాదాల నడుమ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశ ప్రధాని కొడుకుతో ఢీకొని గెలిచి సత్తా చాటిన ప్రణయ్ భాస్కర్ రాజకీయాల్లో ఎందరికో ఆదర్శప్రాయుడు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టి ప్రజలకు అత్యంత చేరువయ్యి ఆయన చేపట్టిన మంత్రి పదవికే వన్నె తెచ్చిన మహానేత ప్రణయ్ భాస్కర్. ఆయన ప్రాతినిధ్యం వహించిన హనుమకొండ నియోజకవర్గం పరిధి ఎంత విశాలమైనదో మనందరికీ తెలిసిందే. రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ టెక్నాలజీ లేని ఆ సమయంలోనే ఆయన ప్రతి గడపను తాకుతూ అన్నా అంటే నేనున్నా అని భరోసానిచ్చిన గొప్ప నాయకుడి జయంతి వర్థంతిని ప్రతి ఏటా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వదాయకంగా ఉంది. ఆదివారం ఉదయం ప్రణయ్ మిత్ర మండలి ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహృదయ అనాథ వృద్ధాశ్రమం, కాజీపేట, డబ్బాల్, కుమార్ పల్లి మార్కెట్, ఎంజీఎం సర్కిల్, చామన్ ప్రాంతాల్లో అన్నదాన, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏకైక రాజకీయ వారసుడిగా ఆయన ఆశయాల సారధిగా తను చేయాలనుకున్న, మధ్యలో ఆగిన అంశాలను పూర్తి చేస్తానని అభినవ్ భాస్కర్ వ్యాఖ్య చేశారు. అంతేకాదు మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రధాత ప్రణయ్ భాస్కర్ అంటూ గత ముఖ్యమంత్రి కేసిఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఆయన సేవలను కొనియాడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని అభినవ్ అన్నారు. ఆయనకు ప్రభుత్వ పరంగా రావాల్సిన, దక్కాల్సిన గౌరవం వాస్తవికంగా జరుగలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా దానిని భర్తీ చేయడానికి చేయాల్సిన కార్యక్రమాలను ప్రకటిస్తాము. ఈ కార్యక్రమంలో ప్రణయన్న ఆప్తులు, స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News