Saturday, March 21, 2026

*దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి** జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము —*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )దివ్యాంగ విద్యార్థులను ఆదరించాలని వారిని దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాలని భారంగా భావించకూడదని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.జగిత్యాల పట్టణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించి శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడాలని వారన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు మాట్లాడుతూ దివ్యాంగులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతి విభాగాల్లో ఎదగాలని దివ్యాంగుల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.దివ్యాంగులను గౌరవించి వారి అవసరాలను తీర్చి సమాన హక్కులు కల్పించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐ ఆర్ ఈ పి లు రాజేందర్ రాజబాబు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News