అండర్ ప్యాసేజ్ నిర్మాణ పూర్తవడంతో హర్షం వ్యక్తం చేస్తున్న, వెపంజేరి, శెట్టి ఫోరం ప్రజలు
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం
చిత్తూరు, జీడీ నెల్లూరు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, జీడీ నెల్లూరు మండలం, వేపంజేరి సమీప ప్రాంతమైన బంగారెడ్డి పల్లె గ్రామ పంచాయతీ, శెట్టి ఫోరం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చొరవతో పరిష్కారం లభించింది. దీంతో వేపంజేరి, శెట్టి ఫోరం గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ దగ్గుమళ్ళకు కృతజ్ఞతలు.., కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
జీడి నెల్లూరు మండలంలోని వెపంజేరి, బంగారెడ్డి పల్లె గ్రామ పంచాయతీ,శెట్టి ఫోరం గ్రామీణ ప్రాంతాల మధ్య హైవే రోడ్డును ఏర్పాటు చేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామ ప్రజలు తమ నిత్య కార్యకలాపాలను నిర్వహించుకోలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో తాము పడుతున్న కష్టాలను చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు మొరపెట్టుకున్నారు.
జాతీయ రహదారి కింది భాగంలో అండర్ ప్యాసేజ్ నిర్మాణం ద్వారా దీర్ఘకాలిక సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని విన్నవించారు.
తక్షణమే స్పందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., అండర్ ప్యాసేజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు విజ్ఞప్తిని మన్నించిన ఎన్డీఏ సర్కార్.., తక్షణమే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించింది. గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి రాకపోకలకు అంతరాయం లేకుండా మార్గాన్ని సుగమం చేసింది. దీంతో వేపంజేరి, శెట్టి ఫోరం గ్రామీణ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు కృషిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు.