Wednesday, March 18, 2026

*దుర్గసముద్రంజగనన్నకాలనీలో భక్తిశ్రద్ధలతో గుండాల గంగమ్మ పూజలు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్*మండలంలోని దుర్గ సముద్రం జగనన్న కాలనీలో వెలసిన గుండాల గంగమ్మ కు ఆలయం పునర్నిర్మాణుకులు కామసాని రత్నమ్మ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనుర్మాసం ప్రారంభం పురస్కరించుకొని అమ్మవారిని వివిధ పల పుష్పాలతో అలంకరించారు ముందుగా పసుపు కుంకుమ,పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అర్చకులు శ్రీరామ అయ్యంగార్ చే అష్టోత్తర మంత్రాలతో అమ్మవారికి పూజలు చేసారు మహిళలు భక్తి శ్రద్ధలతో మొక్కు కున్నారు స్థానిక కాలనీ కి చెందిన వాసవి అమ్మవారికి ఘంట, శూలాలు, పల్యాలు, (తట్టలు) రెండు జతల వెండి కళ్ళు అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పురాతన కాలంలో వెలిసిన అమ్మవారు చుట్టూ పరిసరాలు గ్రామస్థులు ఏడాదికి ఒకసారి అమ్మవారికి పూజలు చేసేవారని ఈ కాలనీ ఏర్పడ్డాక నరసింహా రెడ్డి దంపతులు అమ్మవారిపై ప్రత్యేక దృష్టి సారించి తమ నిధులతో అభివృద్ధి చేస్తూ ప్రతి రోజూ పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈకార్యక్రమంలో కాలనీలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News