నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 19, ,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని చిత్తలూరు గ్రామ సమీపంలో వెలసిన కెమికల్ విత్తనాల కంపెనీని ఇక్కడి నుండి వేయాలంటూ మరికల్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్తనూరు కంపెనీ లో కెమికల్ తయారు చేయడం దుర్వాసనతో అనారోగ్య పాలవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కంపెనీ పొగ వల్ల పలు పంటలు నష్టమవుతున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు చిత్తనూరు ఫ్యాక్టరీ నుండి వెలువడే పొగ ద్వారా చెట్లు ఎండిపోతున్నాయని చుట్టుపక్కల గ్రామాలు రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు చిత్తనూరు విత్తనాల ఏమి తయారు చేస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. చిత్తనూరు ఫ్యాక్టరీలో వెలబడే దుర్వాసన పొగతో ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉందని మరికల్ మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా గత సంవత్సరంలో ఫ్యాక్టరీని ఎత్తివేయాలని చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజలు ఆందోళన చేసిన వారిపై దాదాపు 90 మంది పై తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగిందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీలో ఏమి తయారు చేస్తున్నారో మరికల్ మండల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మరికల్ మండలంలో దుర్వాసన వల్ల పలు పంటల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా అధికారులు స్పందించి చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మరికల్ మండల ప్రజలు కోరుతున్నారు. గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని మరికల్ మండల ప్రజలు జిల్లా స్థాయి అధికారులను కోరుతున్నారు.

