నేటి సాక్షి,నల్లబెల్లి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ ఎం హనుమంతరావు ను నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తలు తాటిపెల్లి.సోదరులు సోమవారం హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం హనుమంతరావుకు దేవాలయం పక్షాన జ్ఞాపికను అందజేశారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన హనుమంతరావు ఈ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తాటిపెల్లి.బ్రదర్స్ తెలిపారు..





