నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 07 ~అన్నమయ్య జిల్లా :-: అక్రమ కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో బెదిరేదేలేదని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ”సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశానని కాకాణి వెల్లడించారు. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని శాసనసభ్యులు సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటని కొంచమైనా సిగ్గుండాలంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ”టీడీపీ శాసనసభ్యులు సొమిరెడ్డి నోరు తెరిస్తే ఆయన నోట్లో నుంచి వచ్చేవన్నీ అబద్ధాలే. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశామని టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని దేవుడి ధర్మాన్ని పక్కన పెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డి లాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటని కాకాణి మండిపడ్డారు. ”సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి సిద్ధమా. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్‌కు సిద్ధం” అని కాకాణి సవాల్ విసిరారు. దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్‌రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరమేంటి. దేవుడి భూములు వేరు చేసి రోడ్డు ఎందుకు వేశారు. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు..—————————–





