నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన పట్టా భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా వేసిన దారిని అధికారులు తొలగించారు. సర్వే నెంబర్ 1492లో ఉన్న ఎకరాలు 3-17 గుంటల విస్తీర్ణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జివాకర్ రెడ్డి, కోరుట్ల తహశీల్దార్ కృష్ణ చైతన్య, మండల సర్వేయర్ కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్రమంగా తీసిన కందకాన్ని గుర్తించి, దారిని తొలగించే చర్యలు చేపట్టారు.*ఆలయ భూముల రక్షణపై దృష్టి*దేవాలయ ఆస్తులపై ఎలాంటి అక్రమాలకూ తావులేదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ ఎతిరాజం నర్సయ్య మాట్లాడుతూ దేవాలయ భూములను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధర్మకర్తలు నేతి శ్రీనివాస్, కటుకం దివాకర్, కోట గంగాధర్, గొడికె రాములు, చిలువేరి విజయ్ కుమార్, శ్రీమతి చిట్యాల పద్మ, ఈఓ ఎం. విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పి. నర్సయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు._____





