- – ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నోళ్లు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు?
- – నాటి ప్రధానికి ఎదురొడ్డి పోరాడిన వారిని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలి
- – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
నేటి సాక్షి, కరీంనగర్: భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పౌరుల కనీస హక్కులను కూడా కాలరాస్తూ నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25 సాయంత్రం దేశంలో ఎమర్జెన్సీ విధించారని, ఇది ఒక చీకటి అధ్యాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఎమర్జెన్సీ దినోత్సవ సందర్భంగా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లోని శుభమంగళ గార్డెన్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. దేశ ప్రజలంతా నివ్వరపోయేలా, ప్రజాస్వామ్యాన్ని ఇందిరాగాంధీ లాంటినిరంకుశురాలు ఖునీ చేశారని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో నాడు ఇందిరాగాంధీ తీసుకువచ్చిన ఎమర్జెన్సీ, దాదాపు 21 నెలల పాటు కొనసాగి 1977 మార్చి 21 వరకు అమలులో ఉందన్నారు. ఈ కాలంలో ఇందిరాగాంధీ తాను చేసిందే శాసనంలా ఉండేదని, నిజాలను నిర్భయంగా వెల్లడించే పత్రికల వారిని, సమాజ సేవకులను, తమకు ప్రతికూలంగా ఉండే నాయకులను, దేశభక్తులను, తాను చేసేది తప్పనివారించిన అభ్యుదయ వాదులను, ప్రజాస్వామ్య వాదులను ఎందరినో నాటి ప్రభుత్వం నిరంకుశంగా జైల్లో పెట్టించారన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ, నిరంకుష ప్రభుత్వం నిర్బంధాలను ఎదురొడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన త్యాగమూర్తులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చీకటి రోజులు తీసుకువచ్చిన.. రాజ్యాంగాన్ని కాలరాసిన కాంగ్రెస్.. నేడు రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అనంతరం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు జీవితం గడిపిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణరావు , కొమురవెల్లి సదానందం, జోగినిపల్లి సంపత్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు మాట్లాడారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కమాన్ చౌరస్తా వరకు నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మాజీ మేయర్ డీ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రోగ్రాం కన్వీనర్ కళ్లెం వాసుదేవరెడ్డి, మాడ వెంకటరెడ్డి, సంపత్‌రావు, రంగు భాస్కరాచారి, బొంతల కల్యాణ్‌చంద్ర, దుర్షెట్టి సంపత్, కటకం లోకేష్, మాజీ ఎంపీపీ వాసల రమేశ్, ఎడమ సత్యనారాయణ, జనపట్ల స్వామి, ప్రోగ్రాం కో–కన్వీనర్ ఉప్పు రామకృష్ణ, దండు కొమరయ్య , కార్పొరేటర్లు రాపర్తి విజయ, పెద్దపల్లి జితేందర్, అనూప్, ప్రవీణ్, ఉప్పరపల్లి శీను, గాయత్రీ, సుధా వైష్ణవి, సునీత, గౌతమ్‌రెడ్డి, నరసింహరాజు, రతన్, జగదీశ్వరచారి, లక్ష్మారెడ్డి, సంతోష్, శ్రీనివాస్, కుమార్, శేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డి, శివ, హరికుమర్ గౌడ్, మల్లేశం, తిరుపతిరెడ్డి, కమలాకర్ రెడ్డి, రాజు, బాలు తదితరలు పాల్గొన్నారు.