నేటి సాక్షి చెన్నూరు పట్టణ కేంద్రంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా బోడంకి చందు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఫిబ్రవరి 12 తేదీ నాడు కార్మిక వర్గం నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కూలీలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, స్వామినాథన్ సిపాసులు అమలు చేయాలని సీ ప్లస్ 50% ప్రకారం పంటల మద్దతు ధరల చట్టం చేయాలని, విత్తన విద్యుత్ మార్కెట్ చట్టాలు ఉపసంహరించాలని, కౌలు రైతులకు అన్ని పథకాలు అమలు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలని ,మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం 2005 ను పునరుద్ధరించాలని, రెండు వందల రోజులకు పని దినాలు పెంచి కూలి రూపాయలు రోజుకి 700 రూపాయలు పెంచి ఇవ్వాలని, కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ,అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని ,స్కీం వర్కర్స్ ని కార్మికులకు గుర్తించాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న సమ్మెను కార్మికులు కర్షకులు ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమారాణి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి, కావేరి రవి సిఐటియు జిల్లా నాయకులు, బోండ్ల సరిత వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు, కృష్ణమాచారి సిఐటియూ నాయకులు, తుమ్మ రేణుక మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు

