Wednesday, March 18, 2026

*దేశానికి ఇందిర సేవలు చిరస్మరణీయం..**జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం* ————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతిని నిర్వహించారు., ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు. *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .*భారత దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశం కోసం చేసిన సేవలు మరవలేనివన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని దేశానికే కాదు ఇందిరాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే అన్నారు.ఇందిరాగాంధీ భారతీయ మహిళా శక్తికి ధైర్య సాహసాలకు ప్రత్యేక అని తెలిపారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారు అని తెలిపారు.దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన సంస్కరణలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిందని, ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవించే స్థాయికి చేర్చిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసిన ఇందిరా గాంధీ సేవలను తరతరాలు గుర్తు చేసుకుంటూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుచరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News