నేటి సాక్షి ప్రతినిధి (బాపట్ల) జూలై07
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని భాగంగా బాపట్ల పట్టణంలోని 29,28,27 వార్డులలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు నిర్వహించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే వివరించారు.అలాగే కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన సూపర్ సిక్స్ పథకాల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వచ్చిన ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.