Wednesday, March 11, 2026

*దేశ పౌరులకు రాజ్యాంగం అందించిన శక్తివంతమైన ఆయుధం “ఓటు హక్కు**బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్*మంచిర్యాల జిల్లా,, జనవరి 25

నేటి సాక్షి దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 సం” వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొంది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, ప్రోగ్రాం అధికారి ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమీషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 1950 జనవరి 25వ తేదీన ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం స్థాపించబడిందని, ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని అన్నారు. మనదేశంలో వేలు మీద పడే సిరా చుక్క ద్వారా మాత్రమే ప్రభుత్వాలు మారతాయని,18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఓటు నమోదు చేసుకొని వినియోగించుకోవాలని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఒక్క ఓటుతో గెలుపు, ఓటములు స్థానాలు మారుతాయని తెలిపారు. యువ ఓటర్లు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో అర్హత గల వారు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.అనంతరం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని “నా భారతదేశం-నా ఓటు” అనే నినాదంతో అధికారులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్, యంగ్ ఓటర్స్, దివ్యాంగ ఓటర్లు, ఓటు హక్కు నమోదు చేయడానికి కృషి చేసిన ఉత్తమ బూత్ స్థాయి అధికారులు, స్వీప్ నోడల్ ఆఫీసర్, ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసిన కళాజాత బృందాన్ని, లక్షెట్టిపేట, హాజీపూర్ తహసిల్దార్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు, ధ్రువపత్రం అందజేశారుఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News