నేటి సాక్షి : ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని తొలగించడం, బీజేపీ నాయకులు ప్రశ్నించిన తర్వాత మళ్లీ పెట్టడం బాధాకరమని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు స్వయంగా కమిషనర్ కి ప్రధాని మోదీ చిత్రపటాన్ని అందించాను. తొలుత దాన్ని కార్యాలయంలో పెట్టి, కొంతమంది రాజకీయ నేతల ఒత్తిడికి భయపడి తీసివేయడం అత్యంత నిందనీయం. మళ్లీ మేము ప్రశ్నించినప్పుడు మాత్రమే తిరిగి పెట్టడం వాళ్ల అసలైన స్వభావాన్ని చూపిస్తోంది” అని ఆయన విమర్శించారు.దేశ ప్రధానిని అవమానించే కమిషనర్ కి పదవిలో ఉండే అర్హత లేదు.ఇది ఫోటో విషయం కాదు — ఇది దేశ గౌరవానికి తూట్లు పొడిచే చర్యగా ఆయన పేర్కొన్నారు.బీజేపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల గౌరవాన్ని దూషించే ఈ తీరును ఎంతమాత్రం సహించదని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

