నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండల కేంద్రమైనముదివేడు గ్రామంలోని ముస్లిమ్ పుర్ లో 13 వ తారీకున అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న జల్సా (ఇస్తిమా) కార్యక్రమానికి తన వంతు సహకారంగా తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రూ. 50 వేలు అందించి తనలోని భక్తిని చాటారు. భక్తి కార్యక్రమాలకు కుల మతాలకతీతంగా విరాళాలు అందించే వారిలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎవరు సాటి రారని మరో మారు నిరూపించారు. గురువారం మండల ముఖ్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ తనయులు పార్టీ యువ నాయకులు ఖాన్ బ్రదర్స్ అంజాద్, ఫిరోజ్ ఖాన్ చేతుల మీదగా మత పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మండల మైనార్టీ సెల్ ప్రసిడెంట్ నౌషాద్, మాజీ ఎంపీటీసీ కరీముల్లా, వైసీపీ నాయుకులు ప్రకాశ్ రెడ్డి, షంషీర్ అలీ, రాజశేఖర్, మనోహర్ రెడ్డి మరియు మైనార్టీ నాయికులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~





