నేటి సాక్షి :తిరుపతి జిల్లా (బాదూరు బాల)నగరంలోని మురుగునీటి కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనిలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. అలాగే స్కావెంజర్స్ కాలనిలో డ్రైనేజీ కాలువలు, రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి మూర్తి, డి.ఈ.రాజు, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.