నేటిసాక్షి, నల్లగొండ : పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి,) నల్లగొండ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాలు ఉపేందర్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో దోరేపల్లి గ్రామంలో మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 6 ఆధ్వర్యంలో పగిడిమర్రి గ్రామాలలో శీతాకాల ప్రత్యేక శిబిరాలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి, ముఖ్య అతిథి కనగల్ మండలం ఎంపిడిఓ వేద రక్షిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోముఖ్య అతిథి కనగల్ మండలం ఎంపిడిఓ వేద రక్షిత మాట్లాడుతూ, విద్యార్ధులలో ఉన్న సేవాభావాన్ని వెలికి తీసే అవకాశంతో బాటు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తయారువుతారని అన్నారు. అనంతరంమహాత్మా గాంధీ యూనివర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక శిబిరాలను గ్రామ ప్రజలకు సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అక్షరాస్యత, ఆరోగ్యం పై అవగాహన మరియు సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.పగిడిమర్రి గ్రామ సర్పంచ్ మరియు దోరేపల్లి సర్పంచ్ లు మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ యూనిట్ శిక్ష ఆధ్వర్యంలో మా గ్రామంలో వారం రోజులపాటు శ్రమదానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగిస్తున్నందుకు మా గ్రామానికి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, లింగాల గూడెం సర్పంచ్ కదిరే సైదులు, కిసాన్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ గోలి జగాల్ రెడ్డి, ఎనిమిదో వార్డు మెంబర్ గాజుల మారయ్య, ఒకటవ వార్డు మెంబర్ దాసరి లక్ష్మి, నాల్గవ వార్డు నెంబర్ దాసరి అంజమ్మ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కన్నెబోయిన నరసింహ, కదిరే నాగరాజు, యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య, కంబాల పల్లి శివరాణి,కదిర నాగరాజు డాక్టర్ అంకుష్,బోధన మరియు బోధనేతర సిబ్బంది, గ్రామ ప్రజలు ప్రజలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

