నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………ధనుర్మాసం సందర్భంగా వివిధ దేవాలయాలకు దర్శనానికి వెళ్లే భక్తులకు అద్దె ప్రాతిపదికాన ఆర్టిసి బస్సులను ఇస్తున్నామని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల డి. ఎం కల్పన తెలిపారు, మీడియా తో ఆమె మాట్లాడుతూ ధనుర్మాసం ను పురస్కరించుకొని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం పరిపాటని ఈ నేపథ్యంలో భక్తులందరు సమిష్టిగా ఆర్టిసి బస్సును అద్దె కు తీసుకొని దర్శనాలను భద్రంగా చేసుకోవచ్చన్నారు. ఆర్టిసి బస్సులను అద్దెకు తీసుకోవాలని భావించే వారికోసం కొత్త బస్టాండ్ లోని ఎంక్వయిరీ నెంబర్ 9493310269 లో సంప్రదించాలని డి. ఎం. కోరారు.





