నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 13, నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువు నుండి ఉండు మట్టి తరలించి వ్యాపారం చేస్తున్నారని టిఆర్ఎస్ ధన్వాడ మండలం అధ్యక్షులు మదిలేటి వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లాలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వండ్రు మట్టి తిప్పర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం చేశారు. టిప్పర్లు స్పీడు వేగాన్ని త్రించే చర్యలు తీసుకోవాలంటూ ధన్వాడ ఎస్సై రాజేంద్ర కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నామమాత్రంగా 50 ట్రిప్పులు టాక్స్ చెల్లించి వెయ్యి ట్రిప్పులు అక్రమంగా వ్యాపారాన్ని చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా పొందు మట్టి వ్యాపారాన్ని అరికట్టాలని లేనిచో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. వండు మట్టి రైతు పొలాలకు అందాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సుధీర్ కుమార్, జుట్ల సత్యనారాయణ గౌడ్, బి. మల్లేష్ గౌడ్, మహమ్మద్ నాజర్ అహ్మద్, ఇర్ఫాన్, లక్ష్మారెడ్డి, మంది పల్లి సురేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, గోవిందు, రాజేందర్ రెడ్డి, వెంకటప్ప, సమీర్, చిట్టెం శివారెడ్డి, ఏ. బాలరాజ్, జి నర్సింలు తదితరులు పాల్గొన్నారు

