నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి 6,( రిపోర్టర్ ఇమామ్ సాబ్) నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అండర్-15 బాలబాలికల రెజ్లింగ్ (కుస్తీ) పోటీల ఎంపిక రెజ్లింగ్ సెలెక్షన్ విశేషాలు వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధన్వాడ, నారాయణపేట జిల్లా. పాల్గొన్న జిల్లాల క్రీడాకారులు: మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల మరియు నారాయణపేట జిల్లాల నుండి సుమారు 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన అతిథులు & నిర్వాహకులు: గాయత్రి: ధన్వాడ మండల విద్యాధికారి ఎం ఈ ఓ ). జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జిహెచ్ఎం రవికుమార్, నారాయణపేట జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ. నెల్సన్ కుమార్: వ్యాయామ దర్శకులు (పీడీ). బాల్ సింగ్ నాయక్: క్రీడాకారుల తల్లిదండ్రుల ప్రతినిధి. శ్రీనివాస్: కోచ్.ముఖ్యాంశాలుగ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపిక పోటీలు ఎంతగానో దోహదపడతాయి. అండర్-15 విభాగంలో ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలిరావడం ఈ ప్రాంతంలో కుస్తీ పోటీల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని కోరారు.





