Saturday, April 11, 2026

ధన్వాడలో….. సీఎం రేవంత్ రెడ్డి, పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం… డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు పై పాలాభిషేకం….

నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 20,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రానికి పేట నియోజక వర్గం ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం 6 కోట్ల పదిలక్షలు మంజూరు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేట నియోజక వర్గం ఎమ్మెల్యే చిట్టెంపర్నిక రెడ్డి చిత్రపటాలకు ఆదివారం చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేట ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి,చిట్టెం మాధవరెడ్డి, ఉంగరాల వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి దామోదర్ రెడ్డి, ధన్వాడ మండల అధ్యక్షులు కావలి నరహరి, రాజేందర్రెడ్డి నాగేశ్వర్ రెడ్డి,మండల నాయకులు ఉగ్గురాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News