Friday, February 13, 2026

*ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్*—–* 15 వార్డుల్లో హస్తం పార్టీ అభ్యర్థుల ఘన విజయం—-*

నేటి సాక్షి – ధర్మపురి*( రాధారపు నర్సయ్య )ధర్మపురి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. పట్టణ రాజకీయాల్లో ఈ ఫలితం కీలక మలుపుగా మారింది.*ప్రజల తీర్పు – కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ*మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తికాగానే ప్రతి వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యం సాధించడం స్పష్టమైంది. మొదటి వార్డు నుండి 15వ వార్డు వరకు హస్తం పార్టీ అభ్యర్థులు వరుస విజయాలు సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది.*వార్డువారీగా విజేతలు వీరే.!*1వ.వార్డు లో అయ్యోరి వేణుగోపాల్, 2వ.వార్డులో సంగనభట్ల సంతోషి, 3వ వార్డులో ఇందారపు రామయ్య, 4వ వార్డులో కొమిరెల్లి పవన్ కుమార్, 5వ.వార్డులో వేముల నాగలక్ష్మి విజయం సాధించారు.అలాగే 6వ వార్డులో ముదుసుల ప్రశాంత్, 7వ వార్డులో వాంకుడోత్ విజయ్ బాబు, 8వ వార్డులో జంజిరిజాని సువర్ణ, 9వ వార్డులో వీరవేణి నాగలక్ష్మి, 10వ వార్డులో సంగి ఆనంద్ గెలుపొందారు.11వ వార్డులో జక్కు పద్మ, 12వ వార్డులో చుక్క సంధ్య, 13వ వార్డులో చిపిరిసెట్టి రాజేష్, 14వ వార్డులో వేముల రమాదేవి, 15వ వార్డులో వోజ్జల లక్ష్మణ్ విజయం సాధించారు.*పట్టణ రాజకీయాల్లో కొత్త దశ*ఈ ఫలితాలతో ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిని సాధించింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ సమస్యల పరిష్కారంపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఒక్క వార్డులోనూ అవకాశం లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మొత్తంగా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయంతో స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News