Sunday, March 8, 2026

*ధర్మారంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన* *కేసీఆర్‌కు సిట్ నోటీసులు కక్షసాధింపే* – *బిఆర్ఎస్ నాయకులు*

నేటి సాక్షి, ధర్మారం (ఫిబ్రవరి 01) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయదాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వద్ద కరీంనగర్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ధర్మారం మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నందిమేడారం సింగిల్ విండో మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాచూరి శ్రీధర్, పట్టణ శాఖ అధ్యక్షులు తుమ్మల రాంబాబు యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘంగా 14 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ పైన సీట్ విచారణ కోసం నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోవు కాలంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలోని వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాలని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రైతుబంధును రాబందుల తన్నుకపోయాడని అన్నారు. ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ పైన సిట్ విచారణకు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే పనిలో పడ్డారు అన్నారు. ఈ సందర్భంలో పోలీసుల అత్యుత్సాహం వల్ల ఎస్టీ సెల్ మండల శాఖ అధ్యక్షులు అజ్మీర మల్లేశం నాయక్ స్వల్ప గాయం కావడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, చొప్పరి చంద్రయ్య, పూసుకూరి రామారావు, పాకాల రాజయ్య, సంకసాని సతీష్ రెడ్డి, ఎండి రఫీ, దాడి సదయ్య, బెల్లాల రోజా, లక్ష్మణ్, దేవి రమణ, సామంతుల రాజమల్లయ్య, దేవి నళినికాంత్, అజ్మీరా మల్లేష్ , భారత స్వామి, బైరీ సురేష్, కార్బాకుల రాజయ్య, చింతల తిరుపతి, గాజుల రాజు, సంధినేని కొమురయ్య, నాడెం శ్రీనివాస్, మిట్ట భరత్ కుమార్, నారా ప్రేమ్ సాగర్, సల్వాజి మాధవరావు, దేవి రాజేందర్, గంధం తిరుపతి, అజ్మీర శ్రీనివాస్ నాయక్, అజ్మీర తిరుపతి నాయక్, బాలసాని లింగయ్య, బాలసాని తిరుపతి, రావుల మల్లేశం, పంజాల శ్రీనివాస్, తాళ్ల రాజయ్య గౌడ్, ఎండి షరీఫ్, ఎండి అజాం బాబా, కల్లేపల్లి లింగయ్య, నేరెళ్ల సతీష్, మోర కొమురయ్య, పులి నవీన్, నడిమెట్ల ప్రవీణ్, రామనవేని మల్లేశం, పంజాల ఐలయ్య, ఎండి రహీం, మహిళలు కాంపెల్లి అపర్ణ, మర్కా సంధ్య, నెల్లి విజయా, ఈర్ల అనిత, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News