Friday, March 20, 2026

*ధర్మారంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి*

నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 28) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 135వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారని ఈయన పూర్తి పేరు జ్యోతిరావు పూలే గోవిందరావు పూలే. అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేసిన సామాజిక సంఘసంస్కర్త విద్యావేత్త పూలే అని కొనియాడారు. అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశాడని ఈ సందర్భంగా అన్నారు. ఆది నుంచి కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేశాడని స్త్రీలు సమానత్వం పొందాలంటే విద్య తప్పనిసరి అని విశ్వసించి 1948వ సంవత్సరములో పూణేలో బాలికల కోసం తొలిసారిగా పాఠశాలను స్థాపించారని ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 140 పాఠశాలను ప్రారంభించారని పూలే దంపతులు బాల్య వివాహాలకు ప్రతికూలంగా ఉంటూనే వితంతు పునర్వివాహానికి మద్దతుగా నిలిచిన ఘనత వారిదేనని ఈ సందర్భంగా బొల్లి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీ జీ పి ఏ) రాష్ట్ర నాయకులు ధార మధు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, టీ జీ పి ఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, దళిత సంఘ నాయకులు ఇరుగురాల రాజనర్సు, సిలుముల రాజ మల్లయ్య, దూడ లచ్చయ్య, బహుజన నాయకులు గుండా గంగయ్య , మదన్మోహన్, రామగిరి లింగయ్య, ఉప్పులేటి రాజేశం, కాంపల్లి సతీష్, గాజుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News