నేటి సాక్షి, ధర్మారం(ఫిబ్రవరి 16) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం వీడ్కోలు మరియు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులు, తొమ్మిదవ మరియు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన వివిధ విద్యా, సాంస్కృతిక మరియు క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధ్యాగేటి ప్రవీణ్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధ్యాగేటి ఉదయ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు.విద్యార్థులు భవిష్యత్తులో మంచి విజయాలు సాధించి తమ గ్రామం, రాష్ట్రం, దేశానికి సేవ చేయాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

