Saturday, March 21, 2026

*ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి** అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తెలిపారు. బుధవారం మేడిపల్లి మండల కేంద్రంలోని కాచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, మరియు రంగాపూర్ గ్రామం, కోరుట్ల మండల కేంద్రంలో రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ఆకస్మికంగా సందర్శించారు. *వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించాలి*ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకొని కొనుగోలు చేసిన వరి ధాన్యంను వెంటదివెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించాలని కొనుగోలు నిర్వాహకులతో పేర్కొన్నారు. ధాన్యం నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేయాలని అన్నారు. రైతులు తేమ శాతంను పాటిస్తూ కొనుగోలు నిర్వాహకులకు సహకరించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. గోనె సంచుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని తెలిపారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. *వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలి*రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సెంటర్ నిర్వహకులతో సమన్వయం చేసుకోవాలని రైస్ మిల్లు యజమానులకు సూచించారు. రికార్డులు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పడు అప్ డేట్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల తహశీల్దార్ కృష్ణ చైతన్య, క్లస్టర్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, సెంటర్ ఇంచార్జులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News