Friday, March 20, 2026

*ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి** అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తెలిపారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, వెల్గటూర్ మండలంలో శ్రీనిధి, కృష్ణ రైస్ మిల్లులను, మరియు గొల్లపల్లి మండలంలోని సూర్య రైస్ మిల్లును అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ఆకస్మికంగా సందర్శించారు. *వాతావరణ పరిస్థితుల దృష్ట్యా..*ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాణ్యత ప్రమాణాల ప్రకారం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో స‌న్న‌, దొడ్డు రకం ధాన్యం 17 శాతం తేమ ఉన్నా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. రైస్ మిల్లుల వద్ద ఎలాంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలని అన్నారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు.రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సెంటర్ నిర్వహకులతో సమన్వయం చేసుకోవాలని రైస్ మిల్లు యజమానులకు సూచించారు. రికార్డులు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పడు అప్ డేట్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, క్లస్టర్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, సెంటర్ ఇంచార్జులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News