Tuesday, March 17, 2026

ధారూర్ మెథడిస్ట్ జాతరలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు.జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా, ధారూర్ గ్రామంలో నవంబర్ 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగనున్న ప్రసిద్ధ మెథడిస్ట్ జాతరకు వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ రోజు జిల్లా బాంబ్ డిటెక్టివ్ & డిస్పోజల్ టీమ్ డాగ్ స్క్వాడ్ టీమ్ అధికారులు జాతర ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి భద్రతను పటిష్టం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News