Saturday, March 7, 2026

నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలోని నీటి ట్యాంక్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారిని ఆహ్వానించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య.

నేటి సాక్షి 07 మార్చి నంద్యాల:—రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అసెంబ్లీ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి వివరించి..కొణిదెల అభివృద్ధికి సొంత నిధులతో మీరు మంజూరు చేసిన రూ.50 లక్షల నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్హెడ్ నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయింది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వివరించి ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు నియోజకవర్గ అభివృద్ధి పంచాయతీరాజ్ పనుల గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తూ కొణిదెల గ్రామానికి ‘పల్లె పండుగ 1.0’లో రూ.20 లక్షలకు పైగా వెచ్చించి 3 అంతర్గత రోడ్లు పల్లె పండుగ 2.0’లో రూ.45 లక్షలతో చేపట్టిన 7 సీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు తెలపడం జరిగిందిఅనంతరం: కొణిదెల జిల్లా పరిషత్తు స్కూలు నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, పంచాయతీ రాజ్ నిధులు రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య విన్నపించుకోవడం జరిగింది.అంతరం: పంచాయతీ రాజ్ సంబంధించిన నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోలేక, నిర్లక్ష్యానికి గుర‌య్యాయి. కనీసం రోడ్ల మరమ్మత్తు పనులు కూడా గత ప్రభుత్వం చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షాలకు నియోజవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ దెబ్బ‌తిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోర‌డం జ‌రిగింది. అనంతరం: కొత్తపల్లి మండలం శివపురం గ్రామం నల్లమల్ల ఫారెస్ట్ పరిధిలో వెలిసినటువంటి కొలనుభారతి సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళుటకు బీటీ రోడ్డుకు మరియు విద్యుత్ సౌకర్యానికి మరియు జూపాడు బంగ్లా మండలం పారమంచాల గ్రామం నుంచి మిడ్తూర్ మండలం బరక సంజరాయుడు వరకు గతంలోనే అనుమతి ఇచ్చిన బీటి రోడ్డుకు ఫారెస్ట్ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారు, మానవత్వ దృక్పథంతో మా నియోజకవర్గంలో ఉన్న గుళ్ళు కు రహదారులకు నిర్మించుటకు సహకరించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి విన్నపించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పానుకులంగా స్పందిస్తూ త్వరలోనే నందికొట్కూరు నియోజకవర్గం సమస్యలపై, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిధుల మంజూరు, రోడ్డు పనులు, స్థానిక సమస్యలపై త్వరలోనే చర్యలు చేపడతామని స్వయంగా కొణిదెల గ్రామాన్ని సందర్శిస్తామని భరోసా ఇచ్చారు.నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం సమస్యల పైన స్పానుకులంగా స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News