నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్) బాపట్ల నందిరాజు తోట శివాలయంలో మరీదు వెంకటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు గురు స్వాముల ఆధ్వర్యంలో గురువారం భక్తి పరవశంతో అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం బాపట్ల ఐ న్యూస్ పరిశా వెంకట్ పాల్గొని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప, భవాని, శివ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామి సేవలో తరిశారు.ఈ సందర్భంగా బాపట్ల ఐ న్యూస్ రిపోర్టర్ పరిశా వెంకట్ స్వయంగా స్వాములందరికీ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేసి సేవాభావాన్ని ప్రదర్శించారు. పాల్గొన్న స్వాములు ఆయన భక్తిని ప్రశంసించి, అయ్యప్ప స్వామి దయ, దివ్య కృప ఎల్లప్పుడూ వెంకట్ పై ఉండాలని ఆశీర్వదించారు.పడి పూజా, సద్ది సేవలతో ఆలయ ప్రాంగణం “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో మార్మోగి, భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో నందిరాజుతోట గ్రామ పెద్దలు మరియు అయ్యప్ప భజన భక్తి బృందం పాల్గొన్నారు.





