నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నంబాల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల (ZPSS), మన్నెగూడెం ప్రాథమిక పాఠశాలలను ఈ రోజు సర్పంచ్ లక్ష్మీ నీలయ్య గారు సందర్శించి, అక్కడ నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పలు సమస్యలను సర్పంచ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థి, విద్యార్థినులకు బస్సు సౌకర్యం, స్కూల్ ఇన్ టైమ్ & ఔట్ టైమ్ కు అనుగుణంగా రవాణా సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే పాఠశాలకు తాగునీటి సదుపాయం, వంటగది (మిడ్ డే మీల్ షెడ్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమస్యలపై స్పందించిన సర్పంచ్ లక్ష్మీ నీలయ్య గారు, కలెక్టర్ గారితో మరియు RTC ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అతి త్వరలోనే వంట షెడ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా NREGS టెక్నికల్ అసిస్టెంట్‌ను పిలిపించి చర్చించడం జరిగింది. పాఠశాలలో అవసరమైన చిన్నచిన్న మరమ్మత్తులపై హెడ్ మాస్టర్ గారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని హెడ్ మాస్టర్ గారికి సూచించారు.అలాగే 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.పాఠశాల సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సర్పంచ్ గారిని విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ పాగిడి విజయ్ కుమార్,మాజీ సర్పంచ్ & మాజీ MPTC కొవ్వూరి శ్రీనివాస్,వార్డు సభ్యులు బక్క ఆనంద్, ఇప్ప వెంకటి,గ్రామ పెద్దలు సిద్ధేంకి సత్తయ్య, రాంటెంకి శ్రీనివాస్, ముదం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

