Tuesday, January 20, 2026

నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలు అరెస్టు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

రెండు వేర్వేరు సంఘటనల్లో అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ మరియు పరకాల, గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

ఈ రెండు ముఠాల నుండి పోలీసులు సుమారు 63లక్షల 62వేల రూపాయల విలువ గల నకిలీ, కాలం తీరిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 8వందల లీటర్ల గడ్డి మందుతో పాటు, నకిలీ పురుగు మందుల తయారీకి అవసమయిన సామగ్రితో పాటు ఏడు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1) జయదీప్‌ గౌతమ్‌, వయసు 33, మేడ్చల్‌ మల్కాజిగిరి,2)  ముద్దంగుల ఆదిత్య ,వయసు 32, మోహిదీపట్నం హైదరాబాద్‌, 3) మాచబోయిన తిరుపతి, వయసు 35, నాగారం గ్రామం పరకాల మండలం. 4) అన్నం కుమారస్వామి ఇవయసు 42, పాపయ్యపల్లి చేల్పూర్‌ గ్రామం ములుగు ఘన్‌పూర్‌ మండలం.5.బెరి రెడ్డి మర్రి రెడ్డి, వయస్సు 42, ఎల్కతుర్తి హవేలీ,గీసుగొండ మండలం,వరంగల్‌ జిల్లా, 6.తుమ్మ గుండ్ల సందీప్‌ రెడ్డి, వయస్సు 37, సంగారెడ్డి జిల్లా, 7.తుమ్మగుండ్ల విజయ్‌ జోసెఫ్‌, వయస్సు 36, సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.*

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడిస్తూ..పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ మరియు పరకాల పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి ప్రధాన నిందితుడు నాగారం చెందిన మాబొయిన తిరుపతి ఇంటిపై పోలీసులు దాడి చేసి నకిలీ, కాలం తీరిన పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు విచారించగా నిందితుడు ఇచ్చిన సమచారంతో పోలీసులు హైదరాబాద్‌లో మోహిదీపట్నం ప్రాంతంలో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గొదాంపై దాడి చేసి పోలీసులు సుమారు 57లక్షల 44వేల రూపాయల నకిలీ,కాలం తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు జయదీప్‌ గౌతం, ఆదిత్య, కుమార స్వామిలను పోలీసులు అరెస్టు చేసారు. మరో సంఘటనలో పోలీసులకు అందిన సమాచారంతో గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎల్కతుర్తి హవేలీ ప్రాంతంలో బెరి రెడ్డి మర్రి రెడ్డి ఇంటిపై దాడి చేసి ఒక కిలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం సంగారెడ్డి జిల్లా చింతల చేరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్‌ రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్‌ జోసెఫ్‌ ఇండ్ల సుమారు 6లక్షల 18వేల రూపాయల విలువ గల 166 కిలోల నకిలీ విత్తనాలతో పాటు 8వందల లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు. నిందితులను పట్టు కొవడంలో ప్రతిభ కనబరిచన టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి మధుసూధన్‌, పరకాల, మామూనూర్ ఏసిపి వెంకటేష్ లు సతీష్‌ బాబు, ఇన్స్‌స్పెక్టర్లు బాబులాల్‌, సార్లరాజు, రంజిత్‌, పరకాల ఇన్స్‌స్పెక్టర్‌ క్రాంతి కుమార్‌, ఏఏఓ సల్మాన్‌ పాషాతో పాటు, టాస్క్‌ఫొర్స్‌,పరకాల పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఎస్‌.ఐలు, ఇతర పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News