Monday, March 16, 2026

– నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులకు కస్టడీ..- మూడు రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు- తంబళ్లపల్లి కోర్టు అనుమతితో పోలీసుల అదుపులోకి నిందితులు – మదనపల్లె సబ్‌జైల్ నుంచి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలింపు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 26 ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులోని ఐదుగురు ప్రధాన నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానంఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ28 తాండ్ర రమేశ్‌, ఏ27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఏ29 షేక్ అల్లబక్షులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు వారిని తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు వీరిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కల్తీ మధ్యం కేసులో మొత్తం 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికే 25 మందికి కష్టడి విచారణ పూర్తి చేశారు. అయితే కేసులోని నిందితుల వద్ద స్టేట్ మెంట్లు తీసుకొని అనంతరం తీసుకొచ్చి సబ్ జైలుకు తరలిస్తున్నారు. తప్పితే ఎవరెవరి పాత్ర ఎంతుందోననే సమాచారాన్ని కింది స్థాయి అధికారుల నుండి ఎక్స్సైజ్ కమిషనర్ వరకు బయట పెట్టక పోవడంతో వీరి విచారణ ఇష్ట రాజ్యాంగ సాగుతుందా. ఇటువంటి ఘటన రాజ్యాంగ బద్దమా అని పలువురు మేధావులు ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు నిందితులు బావ బామ్మర్దులైన తంబళ్లపల్లి టీడీపీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్ రెడ్డి లను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వీరిని ఎక్కడ దాచిపెట్టారో కూటమి ప్రభుత్వ నేతలకు తెలుసు. ఇదంతా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. అసలైన సిసలైన దోషులను వదిలిపెట్టి వాళ్ల దగ్గర పని చేస్తున్న వాళ్లను పట్టుకుని విచారించడంలో మతబులేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమినేతలు స్పందించి ప్రభుత్వ ఖజానాకు బొక్కబెట్టిన అసలైన నిందితులను అరెస్ట్ చేయాలని వాళ్లేమో బయట దేశంలో మజా చేస్తుంటే ఈ కేసులో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుల చుట్టూ తిప్పడం భావ్యం కాదని ఎక్సైజ్ శాఖ పోలీసుల తీరుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News