నేటి సాక్షి, గన్నేరువారం : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ రూరల్ సీ ఐ స్వామి అన్నారు. శనివారం గన్నేరువరం మండలంలోని పలు విత్తన విక్రయ షాపులను ఎస్సై తాండ్ర నరేష్ , ఏవో కిరణ్మయి తో కలిసి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం చే ధ్రువీకరించబడిన లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను హెచ్చరించారు. ఎవరైనా నిబంధనకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.