* నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు తిరుచానూరు సమీపంలోని కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి నక్కల కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండడం మూలంగా నక్కల కాలనీ వీధుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి చలించిన పి4 పథకం ద్వారా నక్కల కాలనీ ని దత్తత తీసుకున్న రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వారిని ఆదుకునేందుకు బుధవారం నక్కల కాలనీ చేరుకున్న ఆయన మాట్లాడుతూ దత్తత తీసుకున్న నక్కల కాలనీక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో వెనువెంటనే నేను జిల్లా అధికారులకు ఫోన్ చేసి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ మొర్రిమేకల దేవరాజులను కాలనీ కి పంపించి అక్కడి ప్రజలకు కావాల్సినటువంటి నిత్య,అత్యవసరాలను తీర్చడంతో పాటు అధికారుల తక్షణ సహకారంతో నక్కల కాలనీ చేరిన నీటిని బయటికి వెళ్లేలా జెసిబి యంత్రాలను ఉపయోగించి బయటకు నీటిని తోడి పోసి అక్కడి ప్రజలకు నివాస యోగ్యం గా చేయడమే కాకుండా కాలనీలో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులు,బాలింతలు,గర్భిణీలు ,దినసరి పూసల ను అమ్ముకునే కూలీలు అందరికీ దాదాపు 300 మందికి హోటల్ నుంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి సమాజంలో అందరూ సమానం గా జీవించాలని , నేను దత్తత తీసుకున్న కాలనీ ని అభివృద్ధి పథం లో చూపడమే నా జీవిత సంకల్పం అని కాలనీ అభివృద్ధికి నాకు అన్ని వేళలా సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకి జిల్లా పంచాయితీ అభివృద్ధి అధికారి సుశీలా దేవికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఇళ్లలోకి నీరు చేరాయని తెలిసిన వెంటనే మా కాలనీ ను దత్తత తీసుకున్న దాత డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల స్పందించినటువంటి తీరు మాకు అందిస్తున్న సహాయం ఈ జన్మకి మేము మరువలేమని కాలనీ నాయకులు రాజ్ కుమార్, శీను,శంకర్, గరామణి తదితరులు తెలియ జేశారు.మధ్యాహ్నం ఆహార పంపిణీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ నుంచి ధనుంజయ నాయుడు,డాక్టర్ సుధాకర్ నాయుడు, డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.





