నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ ఎన్. మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు అజరామరం అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటు పడిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అటువంటి మహనీయుడు చూపించిన దారిలో నడిచి సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, ఏసీపీ లు, సిబ్బంది పాల్గొన్నారు.





