*నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామ శివారులో కరీంనగర్-రాయపట్నం ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న షాదీ ఖానా (వివాహ భవనం) నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. మైనార్టీల సంక్షేమానికి తోడ్పాటు అందించేలా గత ప్రభుత్వ హయాంలో అప్పటి సంక్షేమ మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ మైనార్టీ శాఖ ప్రత్యేక నిధుల నుండి 30 లక్షల రూపాయలు కేటాయించడంతో 2023 లో ప్రారంభమైన నిర్మాణ పనులు నేటికి ఆలస్యంగా సాగి.. ప్రస్తుతం అర్థంతరంగా ఆగిపోయాయి. దీనిపై పలుమార్లు ముస్లిం పెద్దలు సంబంధిత అధికారులను సంప్రదించిన నిధులు లేవని, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా షాదీ ఖానా నిర్మాణం జరగడం లేదని అంటున్నారన్నారు. ఇది పూర్తయితే ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని ముస్లిం మైనారిటీలు పలు శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతున్నందున ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ చూపి షాదీ ఖానా పూర్తి నిర్మాణంకు కృషి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ముస్లిం మైనార్టీలు కోరుతున్నారు.

