నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని నరసింహులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జెట్టి రమేష్ సోమవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామంలోని ఆరు వార్డుల వార్డు సభ్యులు కూడా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారి చేత కూడా ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో జెట్టి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.





