నేటి సాక్షి:– మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నవంబర్ 3వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే మెరుపు సమ్మె నిర్వహిస్తున్నామని సమ్మె కు సిద్ధం కావాలని *ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు, సీపీఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ లు పిలుపునిచ్చారు.. మున్సిపల్ కార్మికుల సమ్మె జయప్రదం పై బిసన్న అధ్యక్షతన మున్సిపల్ మేనేజర్ కు సమ్మె నోటిస్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు జరిగిన పిఆర్సి ప్రకారం వేతనాలు పెంపుదల చేయాలని, పేరిగిన జనాభా కనుగుణంగా ప్రతి మున్సిపల్ లో వర్కర్స్ ను పెంపుదల చేసి డైలీ వేజ్, పార్ట్ టైం కార్మికులను ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఎన్నిసార్లు చర్చించిన సమస్యలు పరిష్కారం కాలేదని ఇది మాటికి ప్రభుత్వ తప్పిదమేనని ప్రభుత్వమే సమ్మెకు ప్రోత్సహించే రీతిలో సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. కార్మికులు చనిపోయిన వారి కుటుంబాల వారిని హౌసింగ్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవాలన్నారు.. 2023 సమ్మె ఒప్పందంలో పెంచిన వేతనాలను ఏమాత్రం అమలు చేయడం లేదన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని లేని యెడల నవంబర్ 3వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హేచ్చరించారు.. అక్టోబర్ 23వ తేదీన మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నా 25వ తారీఖున బైక్ ర్యాలీలు 27 తేదీన అనంతపురం ఆర్డీ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సమ్మె జరగక మునుపే సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని లేక పక్షంలో మెరుపు సమ్మె తప్పదని వారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నాగరాజు,రాజు శ్రీరాం, దొరస్వామి, నరసింహుద్, చిన్న నందయ్య, శంకర్ రావ్, రాజ్, దానెమయ్య బట్టు విజయ్ తదితరులు పాల్గొన్నారు..





