నేటిసాక్షి, మిర్యాలగూడ : జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించనట్లుసంఘం రాష్ట్ర చైర్మన్ అనువోజు వెంకటేశం, రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ కాలనీలో కళాకారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మేరకు గత నాలుగు రోజులు గా నిర్వహిస్తున్న ప్రచారంలో రాష్ట్ర కమిటీ నాయకులు, 33 జిల్లాల ఇన్చార్జీలు, మరియు తెలంగాణ నలుమూలల నుండి ఉద్యమ కళాకారులు పాల్గొన్నాట్లు తెలిపారు. యాదవ్ అన్న మీద ఉన్న అపారమైన అభిమానంతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ప్రజానికం పట్ల ఉన్న నిజమైన అంకితభావం, నిబద్ధత మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసిందనిజూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ప్రజలతో కలసి, వారి సమస్యలను నేరుగా వినడం, వాటికి వెంటనే పరిష్కారం చూపే దృక్పథం ఆయనలో ఉందని అలాంటి ప్రజానాయకుడు ఈ కాలంలో చాలా అరుదు అని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మళ్లీ ప్రజల ఆశల కేంద్రంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుతోందని అన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన కళాకారులు, సాంస్కృతిక బృందాలు కరపత్రాలు పంచుతూ తమ ఆట-పాట ద్వారా స్వచ్చందంగా ప్రజలకు అర్థంమయ్యే పద్ధతి లో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





