నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………….స్థానిక పట్టణ నవ్య బాలికల జూనియర్ కళాశాల లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగాయి.విద్యార్థినులు వివిధ రకాల తెలంగాణ వంటలను తయారు చేసి ప్రదర్శించారు. కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ , ప్రిన్సిపల్ గాలిపెల్లి ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులకు తెలంగాణ సాంప్రదాయ వంటలను పరిచయం చేయడం ద్వారా మన సంస్కృతిని కూడా కాపాడినట్లు అవుతుందని , మన తెలంగాణ వంటలపై విద్యార్థినులకు అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ,అధ్యాపకులు పాల్గొన్నారు.





