*నేటి సాక్షి, ఎండపల్లి:* మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ రహీం కూతురు నామకరణ మహోత్సవం గురువారం నిర్వహించగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హజరై చిన్నారిని ఆశీర్వదించారు. దీనికి ముందు గ్రామ పంచాయితీ అవరణలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరచడంతో గెలుపొందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువలతో సన్మానించి తాజా రాజకీయ పరిస్థితుల గూర్చి చర్చించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింహచలం జగన్, శానబండ సర్పంచ్ గాధం బాస్కర్, తాజా మాజీ గ్రామ సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు వ్యాల్ల రాంరెడ్డి, పడిదం నారాయణ, పడిదం వెంకటేష్, మారం జగన్మోహన్ రెడ్డి, ఆరెల్లి బాబా రాజ్, గంధం రవి, గౌరి చిరంజీవి, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము సంజీవ్, వనం రామనయ్య, అరికిల్ల మహేంధర్, ఉప్పు రాజయ్య, శేరే సత్తయ్య, రాజిరెడ్డి, జితేంధర్ తదితరులు పాల్గొన్నారు.

